క్లాప్ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కి ముహూర్తం ఖరారు!

Published on Oct 6, 2021 8:29 pm IST


ఆది పినిశెట్టి హీరోగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం క్లాప్. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు మరియు వీడియో లు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ద్వి భాష చిత్రం గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఐబి కార్తికేయన్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ షిర్డీ సాయి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి మరియు ఎం రాజశేఖర్ రెడ్డి లు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 8 వ తేదీన ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ ను ఇళయరాజ నే పాడినట్లు తెలుస్తోంది.ఆకాంక్ష సింగ్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, కృష కురూప్, బ్రహ్మాజీ, నాజర్, ప్రకాష్ రాజ్, మేమే గోపి, మునిశ్ కాంత్ ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :