‘విరూపాక్ష’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 24, 2023 12:41 am IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ విరూపాక్ష. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థల పై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని నేడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నచ్చావులే నచ్చావులే అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ని అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేసారు. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ని కూడా ఈ మూవీ తప్పకుండా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం ఖాయం అంటూ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :