అల్టిమేట్ బీట్ తో “అన్నాత్తే” ఫస్ట్ సింగిల్!

Published on Oct 4, 2021 7:43 pm IST


రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకుల, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. అన్నాత్తే అన్నాత్తే అంటూ సాగిన ఈ పాటకు వివేక లిరిక్స్ రాయగా, ప్రముఖ లెజెండరీ సింగర్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాలు పాడటం జరిగింది. ఈ చిత్రానికి డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు.

అడ్డిరిపోయే బీట్ తో ఉన్న ఈ ఫస్ట్ సింగిల్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుబెన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లో కుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, సూరి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :