లేటెస్ట్…”డబుల్ ఇస్మార్ట్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

లేటెస్ట్…”డబుల్ ఇస్మార్ట్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Published on Jul 1, 2024 4:10 PM IST


ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్, హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ అయిన స్టెప్ప మార్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుతో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సాంగ్ ను రిలీజ్ చేశారు.

సాంగ్ మాస్ డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ పాటకు మాస్ బీట్స్ అందించారు. సాంగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తుంది అని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు