మణిరత్నం “పోన్నియిన్ సెల్వన్1” నుండి పొంగే నది రిలీజ్!

Published on Jul 31, 2022 8:33 pm IST


విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, ఆర్.శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, రహ్మాన్, ఆర్ పార్తిబన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తూ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్. ఈ చిత్రం ను లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్ లపై భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. తెలుగు లో పొంగే నది పేరిట పాటను విడుదల చేయగా, ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, ఏ ఆర్ రెహమాన్, ఏఆర్ రెహనః, బాంబ బక్య లు పాడటం జరిగింది. ఏ ఆర్ రెహమాన్ వాయిస్ తో సాంగ్ ఎనర్జిటిక్ గా ఉంది. గ్రాండ్ విజువల్స్ పాటను మరింత ఆసక్తి గా మలిచాయి. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :