కార్తికేయ “రాజా విక్రమార్క” నుండి ఫస్ట్ సింగిల్ విడుదల!

Published on Sep 21, 2021 5:52 pm IST

గుమ్మకొండ కార్తికేయ హీరోగా, తన్య రవి చంద్రన్ హీరోయిన్ గా శ్రీ సారిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ చిత్రం లో సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్ష వర్ధన్, సుధాకర్ కోమకుల, సూర్య, జెమినీ సురేష్, జబర్దస్త్ నవీన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడం జరిగింది.

రాజా గారు బయటికి వస్తే అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆది రెడ్డి టి. సమర్పణ లో 88 రమా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పిసి మౌళి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. జెస్విన్ ప్రబు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు మరియు వీడియో లు ఇప్పటికే ఆకట్టుకోగా, ప్రస్తుతం విడుదల అయిన రాజా గారు బయటికి వస్తే ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :