“రూల్స్ రంజన్‌” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Published on May 15, 2023 3:58 pm IST


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి రూల్స్ రంజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. నీ మనసు నాకు తెలుసు, మరియు ఆక్సిజన్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాల వెనుక ఉన్న రథినం కృష్ణ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయిక గా నటిస్తుంది. ముందుగా ప్రకటించినట్లుగా, మేకర్స్ నాలో నేనే లేను అనే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయడం జరిగింది. అమ్రిష్ స్వరపరిచిన ఈ లవ్ ట్రాక్‌కి శరత్ సంతోష్ స్వరాలు, రాంబాబు గోసాల సాహిత్యం అందించారు.

పాట ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి పాటలో బాగున్నారు. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు క్లాసీ సినిమాటోగ్రఫీ మరియు లైవ్లీ బ్యాక్‌డ్రాప్‌లు బాగున్నాయి. రూల్స్ రంజన్ షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి. జూలై తొలివారంలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్టార్ లైట్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లావానియా, మురళీకృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :