శివ కార్తికేయన్ “మావీరన్” నుండి ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్!

Published on Feb 17, 2023 5:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా డైరెక్టర్ మదొన్నే అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మావీరన్. ఈ చిత్రం తెలుగు లో మహా వీరుడు పేరిట రిలీజ్ కానుంది. ఈ చిత్రం కి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. నేడు శివ కార్తికేయన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్ ఈ పాటని పాడటం జరిగింది.

మాస్ బీట్ తో, ఫుల్ ఎనర్జిటిక్ గా పాట సాగింది. సీన్ అహ్ సీన్ అహ్ అంటూ సాగిన ఈ పాట రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :