జూలై 8న‌ ”సితార్” ప్లే చేస్తున్న ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’

జూలై 8న‌ ”సితార్” ప్లే చేస్తున్న ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’

Published on Jul 6, 2024 9:00 PM IST

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఆతృత‌గా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ పై మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ”సితార్” అనే ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ను జూలై 8న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ పాట రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ గా రానుంది.

కాగా, ఈ సినిమాలో ర‌వితేజ ఓ స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తుండ‌గా, అందాల భామ భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు