“పొన్నియిన్ సెల్వన్2” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ

Published on Mar 18, 2023 2:10 am IST


స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్2. మొదటి పార్ట్ తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం పార్ట్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది.

ఈ చిత్రం లోని ఫస్ట్ సింగిల్ అయిన ఆగనందే ను మార్చ్ 20 న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానున్న ఈ సినిమా కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :