“వీర సింహారెడ్డి” నుండి ఫస్ట్ సింగిల్ పై నేడు అప్డేట్!

“వీర సింహారెడ్డి” నుండి ఫస్ట్ సింగిల్ పై నేడు అప్డేట్!

Published on Nov 23, 2022 1:54 PM IST

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకు రానుంది.

మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలయ్య కోసం మరోసారి సాలిడ్ స్కోర్ ఇచ్చాడు థమన్. 2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెయిన్ విలన్‌గా నటిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు