ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్న సవ్యసాచి !

savya

యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ విడుదలకు సమయం దగ్గర పడింది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈనెల 9న ఈచిత్రంలోని ‘వై నాట్’ అనే మొదటి సాంగ్ ను 11గంటలకు విడుదలచేయనున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ చిత్రం ఫై అంచనాలను పెంచేసింది. ఎప్పటిలా కాకుండా చైతు ఈసినిమాతో రొటీన్ కు బిన్నంగా అదిరిపోయి కాన్సెప్ట్ తో రానున్నాడని తెలుస్తుంది.

చందు మొండేటి తెరకెక్కిస్తున్నఈచిత్రంలో మాధవన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం నవంబర్ 2న భారీ స్థాయిలో విడుదలకానుంది. అక్కినేని అభిమానులు ఈ చిత్రం ఫై భారీ ఆశలే పెట్టుకున్నారు.

Exit mobile version