“గ్యాంగ్‌స్టర్ గంగరాజు” సినిమా నుంచి తొలి పాట విడుదల..!

Published on Sep 10, 2021 12:10 am IST


విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ లాంటి మరో వైవిధ్య భరితమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు . ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే తాజాగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం తొలి పాటను విడుదల చేసింది. ‘ఏమో ఇలాగా’ అంటూ మొదలైన ఈ పాటను భాస్కర భట్ల రచించగా, హేమచంద్ర ఆలపించారు. మ్యూజిక్ సెన్సేషన్ సాయి కార్తీక్ సంగీతం అందించారు. అనీష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ కాగా ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది. మరీ మీరు కూడా ఈ పాటను ఓసారి వినేయండి.

సంబంధిత సమాచారం :