తొలిసారి తండ్రితో కలిసి నటిస్తున్న మంచు లక్ష్మీ..!

Published on Feb 13, 2022 1:00 am IST

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫిబ్రవరి 12వ తేదిన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేసారు.

తొలిసారి మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్ర పోషించబోతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ఇది ఒక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని, మోహన్ బాబు, మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారని అన్నారు. మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.

సంబంధిత సమాచారం :