దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా ‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్ రిలీజ్..!

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా ‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Published on Nov 25, 2021 9:45 PM IST


ప్రభుదేవా, రెజినా, అనసూయల కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ మూవీ ‘ఫ్లాష్ బ్యాక్’. “గుర్తుకొస్తున్నాయి” అనేది ట్యాగ్ లైన్‌. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇది వరకు రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీకి సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లను విడుదల చేశారు. మొదటి దాంట్లో ప్రభుదేవా, రెజీనాలో లవ్ ట్రాక్ చూపిస్తే, రెండో దాంట్లో అనసూయ తన లుక్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు పోస్టర్లకు విశేషమైన స్పందన లభిస్తోంది.

హై ఎమోషన్స్‌ని కూడుకుని యూత్‌ను కట్టిపడేసేలా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. టైటిల్, ట్యాగ్ లైన్‌తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. రెజీనా ఇందులో ఆంగ్లో ఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపించనుండగా, అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని దర్శక నిర్మాతలు తెలిపారు.

ద్విభాష చిత్రంగా రాబోతోన్న ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాకు తెలుగులో నందు తుర్లపాటి సంభాషణలు రచిస్తున్నారు. తమిళ డైలాగ్స్‌ను దర్శకుడే రాసుకున్నారు. శామ్ సీఎస్ అందిస్తున్న మ్యూజిక్ ప్రధాన బలం కాగా, చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు అందిస్తున్నారు. నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు