“అవతార్ 2” కి ఫుట్ బాల్ దెబ్బతో షాకింగ్ ఓపెనింగ్స్.!

“అవతార్ 2” కి ఫుట్ బాల్ దెబ్బతో షాకింగ్ ఓపెనింగ్స్.!

Published on Dec 15, 2022 1:14 PM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “అవతార్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే వరల్డ్ వైడ్ ఏకంగా 160 భాషల్లో అనేక దేశాల్లో మాసివ్ రిలీజ్ అవుతుండగా రికార్డు ఓపెనింగ్స్ దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ ఓ దగ్గర మాత్రం అవతార్ 2 కి షాకింగ్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇది ఎక్కడంటే ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగిన ఫ్రాన్స్ లో అట. మరి అక్కడ అవతార్ 2 ఒకరోజు ముందే రిలీస్ కాగా సరిగ్గా ఇదే రోజు ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో మ్యాచ్ ఉండగా దీనితో అక్కడ మాత్రం అవతార్ 2 అనుకున్న రేంజ్ కి దరిదాపుల్లో కూడా ఓపెనింగ్స్ రాబట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి అయితే అవతార్ 2 కి మాత్రం ఫుట్ బాల్ ఇలా దెబ్బేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు