“అఖండ” కి ఇప్పుడు తప్పితే మరో మంచి ఛాయిస్ ఉందా?

Published on Sep 30, 2021 7:40 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిస్తున్న చిత్రం “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య సహా ఇతర మాస్ ఆడియెన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ మాత్రం మేజర్ గా ఏపీలో థియేటర్స్ మరియు టికెట్ సమస్యలు సర్దుమణిగాకే రిలీజ్ అవుతుంది అని టాక్.

ఇదిలా ఉంటే సినిమా ఇప్పుడు షూట్ కంప్లీట్ అయ్యిపోవచ్చింది. దీనితో రిలీజ్ సమయం కోసమే అంతా మాట్లాడుకుంటుండగా దసరా నుంచి ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది అని నయా టాక్ మొదలయ్యింది. కానీ దానికన్నా ముందు అఖండ రాకకు మరో మంచి ఛాయిస్ ఉందా అంటే దానికి అవుననే సమాధానం కూడా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు దసరా వచ్చే ఏడాది సంక్రాంతి బరికి అనేక సినిమాలు సన్నద్ధం అవుతున్నాయి.

కానీ మరో పండుగ దీపావళికి మాత్రం చెప్పుకోదగ్గ భారీ సినిమాలు అయితే ఏవి లేనట్టే అనిపిస్తున్నాయి. మరి ఈ ఛాయిస్ ని అఖండ వినియోగించుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాకపోతే అప్పుడికి కూడా తాము అనుకున్న విధంగా పరిస్థితులు మారకపోతే బహుశా అప్పుడు కూడా అఖండ రిలీజ్ ఉండకపోవచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :