ఇంట్రెస్టింగ్..చరణ్ భారీ ప్రాజెక్ట్ కి కథ శంకర్ ది కాదా?

Published on Feb 9, 2022 7:10 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఇండియన్ ఐకానిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇద్దరి కెరీర్ లో కూడా 15వ సినిమాగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ పై తారా స్థాయి అంచనాలు నెలకొనగా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ఇదిలావుండగా శంకర్ సినిమాకి బలం ఏదన్నా ఉంది అంటే అది తన కథలే అని చెప్పాలి.

తాను చూపించేది ఒకటే మెసేజ్ అయినా దానిని మార్చి మార్చి ప్రెజెంట్ చేసి శంకర్ మెప్పిస్తారు. అందుకే శంకర్ సినిమాలు అంటే అంత క్రేజ్ ఉంది. మరి ఇప్పుడు అయితే చరణ్ తో చేస్తున్న భారీ సినిమాకి అయితే కథ శంకర్ ది కాదు అని లేటెస్ట్ టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది. మరి ఈ సినిమాకి తానే కథ అందించినట్టు గా కోలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి కార్తీక్ సుబ్బరాజ్ చెప్పడం వైరల్ గా మారింది.

లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీనితో ఈ టాక్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఇది ఒక పొలిటికల్ డ్రామా అని దానిని శంకర్ గారు అడాప్ట్ చేసుకొని భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్నారని ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది అని తాను తెలపడం మరింత ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :