ఎంగేజ్మెంట్ పిక్స్ : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

Published on Jun 10, 2023 12:43 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువ నటి లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్ మెంట్ నేడు వారి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో హైదరాబాద్ మణికొండ లో గల నాగబాబు స్వగృహంలో ఎంతో వైభవంగా జరిగింది. గతంలో మిస్టర్, అంతరీక్షం సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరూ, కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు, అలానే త్వరలో పెళ్లి చేసుకోనున్నారు అనే వార్తలు ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. అయితే ఫైనల్ గా వీరిద్దరూ ఒక్కటి కానుండడంతో అటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నేడు జరిగిన వరుణ్, లావణ్య ల ఎంగేజ్మెంట్ కి నాగ బాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి కుటుంబం, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్ డాక్టర్ వెంకటేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుష్మిత కొణిదెల మరియు ఆమె కుటుంబం, శ్రీజ కొణిదెల మరియు పలువురు ఈ వేడుకకు విచ్చేసి ఇద్దరినీ ఆశీర్వదించారు. కాగా వీరిద్దరి పెళ్లి తేదీ అయితే ఇంకా ఖరారు కాలేదు. ఇక ఫౌండ్ మై లవ్ అంటూ వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన వారి ఎంగేజ్మెంట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :