వెంకటేష్ కోసం నాలుగు బ్యానర్లు క్యూ

వెంకటేష్ కోసం నాలుగు బ్యానర్లు క్యూ

Published on Jan 12, 2025 2:19 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ పలు ఇంటర్వ్యూల్లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని వెంకటేష్ తెలిపారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. ఈ సినిమాలో మరోసారి వింటేజ్ వెంకీని చూస్తారని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత తనతో సినిమా చేసేందుకు నాలుగు బ్యానర్లు రెడీగా ఉన్నాయని వెంకీ తెలిపారు.

సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, సితార నాగవంశీ, వైజయంతి మూవీస్ బ్యానర్లు తన కోసం కథను రెడీ చేస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, తాను ఇంకా ఏ కథకు ఓకే చెప్పలేదని వెంకీ తెలిపారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత వెంకీ ఏ బ్యానర్‌కు ఓకే చెబుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు