రవితేజ ‘ధమాకా’ నుండి నాలుగవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ ‘ధమాకా’ నుండి నాలుగవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Nov 21, 2022 6:31 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీ పై మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క గ్లింప్స్ టీజర్స్ తో పాటు మూడు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనా మరింతగా పెంచాయి.

అయితే లేటెస్ట్ గా ఈ మూవీ నుండి డు డు అనే పల్లవితో సాగె మాస్ థీమ్ సాంగ్ ని ఈనెల 25న విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం ధమాకా యూనిట్ ప్రకటించింది. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో ధమాకా మూవీ రిలీజ్ తరువాత అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి సక్సెస్ అందుకుంటుందని అంటోంది యూనిట్. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థల పై ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు