లేటెస్ట్..ఓటిటిలో మాన్స్టర్ “కేజీయఫ్ 2” ఫ్రీ స్ట్రీమింగ్ కి డేట్ వచ్చేసింది.!

Published on May 31, 2022 8:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. తమ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా గత కొన్ని రోజులు కితమే ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది కానీ అప్పుడు పే చేసి చూసే విధంగా తీసుకొచ్చారు.

దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని టాక్ రాగా ఇలా ఎందుకు తెచ్చారు అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియో వారు ఈ బిగ్ మూవీ పై మాన్స్టర్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా ను తన ప్రైమ్ మెంబర్స్ ఇక నుంచి ఈ జూన్ 3 నుంచి అన్ని భాషల్లో అందుబాటిలోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. దీనితో ఈ అప్డేట్ తో ఫైనల్ గా ఓటిటి వీక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :