నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ‘కల్కి 2898AD’లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను దీపికా పదుకొణె పూర్తి చేసింది. హిందీ, కన్నడ భాషల్లో దీపికా పదుకొణె డబ్బింగ్ చెప్పారని, మిగతా వెర్షన్లకు వేరేవారితో చెప్పిస్తారని తెలుస్తోంది.
దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో సినిమాల షూటింగ్స్ కు ఆమె గ్యాప్ ఇచ్చింది. కాగా కల్కి సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే,ఈ భారీ-బడ్జెట్ సినిమాలో కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.