“వీరమల్లు” షూట్ పై మరో లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 29, 2022 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” సినిమా కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ ని పవన్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ పనులు చూసుకుంటూనే పాల్గొంటూ పూర్తి చేస్తున్నారు.

అయితే రీసెంట్ గానే స్టార్ట్ చేసిన ఒక సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు మరో షెడ్యూల్ కి గాను రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఈ మే రెండో వారంలో స్టార్ట్ కానుండగా దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది అని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :