మోక్షజ్ఞ స్పెషల్ రోల్.. నిజమేనా ?

మోక్షజ్ఞ స్పెషల్ రోల్.. నిజమేనా ?

Published on Jul 9, 2024 3:00 AM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘అఖండ 2’ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ, ‘అఖండ 2’ షూటింగ్ కి లింక్ కుదిరిందని టాక్. ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.

దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి మోక్షజ్ఞ కోసం ఓ స్పెషల్ రోల్ రాశాడని.. సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ పాత్ర వస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే, మోక్షజ్ఞ పై టెస్ట్ షూట్ కూడా చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. నందమూరి అభిమానులకు శుభవార్తే. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు