ప్రతి నెల లాగే, సెప్టెంబర్‌లో కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈసారి వివిధ హీరోలు, వివిధ జోనర్ల సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో తెలుగు ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైన ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
సెప్టెంబర్ 3 :
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ చిత్రం ‘ఐమ్ గేమ్’ సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న దుల్కర్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడలి.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని వేణు గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేయగా ప్రణయ్ రెడ్డి వంగా ప్రొడ్యూస్ చేశారు.
సెప్టెంబర్ 4 :
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది. మరోసారి తనదైన కామెడీతో అల్లరి నరేష్ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు.
మలయాళం బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బెత్లెహమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగులో రిలీజ్‌కు రెడీ అయింది. నివీన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా మలయాళంలో సాలిడ్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు తెలుగులోనూ మంచి బజ్‌తో సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ 10 :
తమిళ హీరో కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సర్దార్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పూర్తి స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
సెప్టెంబర్ 24 :
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. పూర్తి రా అండ్ రస్టిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యింది.
మరి ఈ సెప్టెంబర్ నెలలో వైవిధ్యమైన జోనర్లలో రాబోతున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయా.. ఏ రేంజ్లో ఇవి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయా అనేది వేచి చూడాలి.
