ఇక నుంచి అక్కడ ‘నాన్ ప్రభాస్ రికార్డ్స్’., కేవలం 10 రోజుల్లోనే

ఇక నుంచి అక్కడ ‘నాన్ ప్రభాస్ రికార్డ్స్’., కేవలం 10 రోజుల్లోనే

Published on Jul 7, 2024 7:59 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఇండియా వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలుసు. అలా తన సినిమాలకి భారీ వసూళ్లు నమోదు అవుతుండగా ఈ చిత్రాలకి యూఎస్ మార్కెట్ సహా తెలుగు స్టేట్స్ లో కూడా భారీ వసూళ్లు నమోదు అవుతుండగా ఇప్పుడు “కల్కి 2898 ఎడి” సినిమాతో ప్రభాస్ అసలు సిసలు కం బ్యాక్ ని చూపించాడు.

తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ “బాహుబలి 2” యూఎస్ మార్కెట్ లో ఇండియా నుంచి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత సౌత్ ఇండియా సినిమా నుంచి రెండో బిగ్గెస్ట్ గ్రాసర్ గా ప్రభాస్ కల్కి కేవలం 10 రోజుల్లోనే ఇప్పుడు నిలిచినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. దీనితో టాప్ లో ఉన్న రెండు సినిమాలు కూడా ప్రభాస్ వే కావడంతో అక్కడ ఇక నుంచి నాన్ ప్రభాస్ రికార్డులే అని చెప్పొచ్చు. ఇక మళ్ళీ వీటి దగ్గరలోకి ఏ సినిమా రానుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు