ఫుల్ డిమాండ్ లో నాని కొత్త చిత్రం !


యంగ్ హీరో నాని సినిమాలకు డిమాండ్ పెరిగిపోతోంది. వరుస పెట్టి హ్యాట్రిక్ హిట్లు సాధించడంతో నాని సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్లలో స్థిరపడిపోయింది. అందుకే ఆయన కొత్త సినిమా ‘నిన్ను కోరి’ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులు రూ. 3.5 కోట్లకు అమ్ముడవగా మిగిలిన ఏరియాలకు కూడా మంచి ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ నాని గత సినిమాలకంటే ఇంకా మెరుగ్గా జరిగే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటంతో సినిమా సక్సెస్ పై ఖచ్చితమైన నమ్మకాలు ఏర్పడ్డాయి. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా నివేత థామస్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.