అదరగొట్టిన మాస్ మహారాజా… ఫుల్ కిక్ మరింత జోష్ గా!

Published on Jan 26, 2022 4:35 pm IST

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ పతాకం పై ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ రోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ చిత్రం నుండి ఫుల్ కిక్కు పాటను విడుదల చేయడం జరిగింది. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రం లో మరింత జోష్ గా కనిపిస్తున్నారు. మీనాక్షి చౌదరీ మరియు డింపుల్ హాయతీ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం కి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :