బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’లో విక్టరీ వెంకటేష్ ?

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’లో విక్టరీ వెంకటేష్ ?

Published on Oct 30, 2022 9:25 PM IST

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’ షో మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా చంద్రబాబు వచ్చాడు. ఆ తర్వాత ఎపిసోడ్ లో విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌లగ‌డ్డ అన్‌స్టాప‌బుల్ షోకి గెస్ట్ లుగా వచ్చారు. అయితే, ఇప్పుడు ఈ షోకి మరో స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ ఈ షోకి గెస్ట్ గా వస్తున్నట్లు తెలుస్తోంది.

వెంకీ వస్తున్న ఎపిసోడ్ చాలా ఎంటర్ టైన్ గా సాగుతుందట. షోలో వెంకటేష్ పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించడం చాలా బాగా ఆకట్టుకుందట. ఈ క్రమంలో బాలయ్య కూడా వెంకీ నటించిన కొన్ని కామెడీ సన్నివేశాల పై పలు ఆసక్తికర విషయాలు పంచుకోనున్నారు. అలాగే బాలకృష్ణ, వెంకీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు