విడుదల తేదీ : మార్చి 27, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : జి.వి.ప్రకాష్ కుమార్, శ్రీ గౌరి ప్రియ, జార్జ్ మరియన్ తదితరులు
దర్శకుడు : మరియా రాజ ఇళంజెళియన్
నిర్మాత : జైవర్ద
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ : మదన్ క్రిస్టోఫర్
ఎడిటింగ్ : సెల్వ ఆర్‌కె
సంబంధిత లింక్స్ : ట్రైలర్
సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా, శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘హ్యాపీ రాజ్’. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఆనంద రాజ్ అలియాస్ హ్యాపీ రాజ్ (జి.వి. ప్రకాష్) తన తండ్రి (జార్జ్ మరియన్) ప్రవర్తన కారణంగా గ్రామంలో అందరి చేత హేళన చేయబడుతుంటాడు. ఆ అవమానాలు భరించలేక బెంగళూరుకు వెళ్లి ఒక కార్పొరేట్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడ కావ్య (శ్రీ గౌరి ప్రియ)తో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే, వీరిద్దరి కుటుంబాల మధ్య ఉన్న సంస్కృతీ సంప్రదాయాల తేడాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వాటిని రాజ్ ఎలా అధిగమించాడనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు. తండ్రి వల్ల అవమానాలు ఎదుర్కొన్నా, కొడుకు ఎప్పుడూ తండ్రిని ఒక్క మాట కూడా అనకపోవడం హృదయానికి హత్తుకుంటుంది. క్లైమాక్స్‌లో వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి.
జి.వి. ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీ గౌరి ప్రియ తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. జార్జ్ మరియన్ తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. చాలా రోజుల తర్వాత ‘ప్రేమదేశం’ అబ్బాస్ ఈ సినిమాలో కనిపించడంతో అభిమానులు థ్రిల్ అయ్యారు.
సినిమా సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ సమపాళ్లలో ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఫ్యామిలీ హీరో ఊరికి వచ్చినప్పటి నుండి కథ ఆసక్తికరంగా మారుతుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. కామెడీ సీన్లు పెద్దగా పండలేదు. కథనం కూడా కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. పాటలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి.
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే గొడవలకు సరైన కారణం ఉండదు. అది కాస్త క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు మరియా రాజ ఇళంజెళియన్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను అందించడానికి ప్రయత్నించినప్పటికీ, కొన్ని చోట్ల తడబడ్డాడు. కొన్ని సీన్స్ చక్కగా అనిపించినా, మరికొన్ని సీన్స్ ఇంకా బెటర్‌గా తీసి ఉండాల్సింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కొంతవరకు ఫర్వాలేదనిపిస్తుంది. మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ బాగుంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే.. ‘హ్యాపీ రాజ్’ కొంతవరకు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. జి.వి. ప్రకాష్, శ్రీ గౌరి ప్రియ మరియు జార్జ్ మరియన్ తమ పర్ఫార్మెన్స్‌లతో మెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ కాస్త విసిగించినా, సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
