“జీ5″లో “గాలివాన” వెబ్ సిరీస్‌కు అనూహ్య స్పందన.!

Published on Apr 15, 2022 2:00 am IST


సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ “గాలివాన”. నిన్నటి నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.

బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేశారు. ఇందులో చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. ఇక ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఓటీటీ వేదిక జీ 5. కేవలం ఒక్క జాన‌ర్‌కు మాత్రమే ప‌రిమితం కాకుండా అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌లతో జీ5 వీక్షకుల మనసులు దోచుకుంటోంది.

సంబంధిత సమాచారం :