ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తున్న “గామి” ట్రైలర్ విజువల్స్

ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తున్న “గామి” ట్రైలర్ విజువల్స్

Published on Mar 1, 2024 7:00 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గామి”. మరి క్రౌడ్ ఫండింగ్ అంటూ స్టార్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ షాక్ కి గురి చేసింది. ఇది వరకు వచ్చిన గ్లింప్స్, టీజర్లలో చూసిన కొన్ని షాట్స్ కే టాలీవుడ్ ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యిపోయారు. మరి ఇప్పుడు ట్రైలర్ చూసాక అయితే మన తెలుగు సినిమా నుంచి ఒక ఊహించని రేంజ్ సినిమా వస్తుంది అని ఫిక్స్ అయ్యిపోయారు.

మెయిన్ గా డెబ్యూ దర్శకుడు విద్యాధర్ చూపించిన మెంటల్ మాస్ విజువల్స్ అయితే ఎన్నో పాన్ ఇండియా సినిమాల్లో కూడా లేవు. దీనితో ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ ఔట్ ఫుట్ చూసిన ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఇంప్రెస్ అయిపోయారు. దీనితో ఈ సినిమాని బిగ్ స్క్రీన్స్ పై తప్పకుండా చూడాలని అయితే ఫిక్స్ అయ్యారు. మరి ఈ మార్చ్ 8న థియేటర్స్ లోకి రానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు