త్వరలో ‘గాయత్రి’ ఆడియో లాంచ్ !

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతోంది ‘గాయత్రి’. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించింది. తెండు విబిన్న పాత్రల్లో మోహన్ బాబు చేసిన నటన సినిమాకు హైలెట్ కాబోతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 28 న మోహన్ బాబు అభిమానుల సమక్షంలో చెయ్యబోతున్నారు. అదేరోజు ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు.

‘పెళ్ళైన కొత్తలో’ సినిమాకు దర్శకత్వం వహించిన మదన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించిన ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూర్చారు. మంచు విష్ణు, శ్రియ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆకట్టుకొనే కథనంతో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నారు.