చరిత్ర సృష్టించిన “గదర్ 2”

Published on Sep 4, 2023 7:02 pm IST

సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్ వాధ్వ, సిమ్రాట్ కౌర్ ప్రధాన పాత్రల్లో అనిల్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా గదర్ 2. ఈ చిత్రం సైలెంట్ గా థియేటర్ల లోకి వచ్చి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 7.80 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ 501.17 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరడం పట్ల ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దంగల్, కేజీఎఫ్ 2 చిత్రాలని క్రాస్ చేసిన ఈ చిత్రం, బాహుబలి 2, పఠాన్ చిత్రాలని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే 500 కోట్ల క్లబ్ లోకి పఠాన్ 28 రోజులు, బాహుబలి2 34 రోజుల సమయం తీసుకుంది. అయితే 24 రోజుల్లో ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. డ్రీమ్ గర్ల్ 2 మరియు ఓ మై గాడ్ 2 చిత్రాలు ఉన్నప్పటికీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబదుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :