522 కోట్లతో “గదర్ 2”

Published on Sep 22, 2023 11:01 am IST

సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్ వాధ్వ, సిమ్రాట్ కౌర్ ప్రధాన పాత్రల్లో అనిల్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా గదర్ 2. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకూ 522 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆరో వారం ఈ సినిమా 4.7 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది.

దంగల్, కేజీఎఫ్ 2, బాహుబలి 2 చిత్రాలని క్రాస్ చేసిన ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే జవాన్ నుండి గట్టి పోటీ ఉండటం తో కలెక్షన్స్ తగ్గినట్లు కనబడుతోంది. జవాన్ చిత్రం బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు లు క్రియేట్ చేస్తుండటం తో గదర్ 2 ను కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :