‘గాలిపటం’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టీం

galipatam-(4)
రెగ్యులర్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఫార్మాట్ కి బ్రేక్ చేస్తూ సరికొత్త తరహాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘గాలిపటం’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి అశేష ప్రేక్షకాదరణ లభిస్తుండడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంశలే వచ్చాయి. దాంతో ఈ చిత్ర టీం అంతా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ ని అందరితో పంచుకోవడానికి ఈ రోజు ఉదయం ‘గాలిపటం’ టీం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమాని ఆది, రాహుల్ రవీంద్రన్, క్రిస్టినా అఖీవా, డైరెక్టర్ నవీన్ గాంధీ, సంపత్ నంది, తదితరులు హాజరయ్యారు. అందరూ ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు, అలాగే విజయాలో కీలక పాత్ర పోషించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ ‘మామూలుగా సినిమా చూసి బయట వచ్చాక బాగుంది – బాలేదు, హిట్ – ఫ్లాప్ అనే అంటారు కానీ ఈ సినిమా చూసి బయట వచ్చిన వారు అంతా సినిమా చాలా కొత్తగా ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన టీం మెంబర్స్ అందరికీ నా థాంక్స్ అని’ అన్నాడు.

Exit mobile version