ఆ రేవ్ పార్టీతో గల్లా అశోక్ సంబంధం లేదు – గల్లా ఫ్యామిలీ

Published on Apr 3, 2022 4:00 pm IST

హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీ జరగడం, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ హోటల్‌ పై దాడులు నిర్వహించి.. సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే, ఈ రేవ్ పార్టీలో 157 మందిని అదుపులోకి తీసుకున్నారని.. వారిలో గల్లా అశోక్ కూడా ఉన్నాడని మీడియాలో బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తల్ని గల్లా కుటుంబం ఖండిస్తూ వివరణ ఇచ్చింది.

ఈ వార్తల పై గల్లా ఫ్యామిలీ స్పందిస్తూ.. ‘నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచారం చేయడం జరిగింది. అయితే, ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ గల్లా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత సమాచారం :