లేటెస్ట్…”గం గం గణేశా” రిలీజ్ డేట్ ఫిక్స్!


టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రం ను మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో హీరో గన్ పట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version