‘గం గం గ‌ణేశా’ ఓటిటి డేట్ అప్పుడేనా..?

‘గం గం గ‌ణేశా’ ఓటిటి డేట్ అప్పుడేనా..?

Published on Jun 15, 2024 11:00 PM IST

యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన రీసెంట్ మూవీ ‘గం గం గ‌ణేశా’ మే 31న రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్ట్ చేయ‌గా, క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డేట్ పై తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.

ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్రైమ్ వీడియో రెడీ అవుతోంది. జూన్ 28 లేదా జూలై మొద‌టి వారంలో ఈ సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తార‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిషోర్ తదితరులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ మ‌రి ఏ రోజున ఓటిటి స్ట్రీమింగ్ కు వ‌స్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు