సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న గమనం…విడుదల కి సిద్దం!

Published on Dec 5, 2021 5:01 pm IST

శ్రియ శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహస్, బిత్తిరి సత్తి, రవి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో సుజనా రావు దర్శకత్వం లో తెరకెక్కిన అంతాలజీ చిత్రం గమనం. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ మరియు కాలి ప్రొడక్షన్స్ ల పై రమేష్ కరటూరి, వెంకీ పుషడపు, జ్ఞాన శేఖర్ వి.ఎస్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం ను డిసెంబర్ 10 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పూర్తి పనులని చిత్ర యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :