“గేమ్ ఛేంజర్”.. అప్పన్న పై సోలో సినిమా వస్తే..?

“గేమ్ ఛేంజర్”.. అప్పన్న పై సోలో సినిమా వస్తే..?

Published on Jan 13, 2025 12:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ ఇంకా అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ పై మరోసారి మంచి ప్రశంసలు వచ్చాయి. తన డైనమిక్ ప్రెజెన్స్ తోనే కాకుండా నటనలో కూడా మళ్ళీ రంగస్థలం తర్వాత మంచి మార్కులు తాను అందుకున్నాడు.

ఇలా గేమ్ ఛేంజర్ లో తాను చేసిన అప్పన్న పాత్రపై చాలా ప్రశంసలు ఇపుడు వస్తున్నాయి. ఆ పాత్రలోని అమాయకత్వం, భావిద్వేగాలని పండించడంలో రామ్ చరణ్ మళ్ళీ అందరినీ ఊహించని విధంగా సర్ప్రైజ్ చేసాడు. దీనితో చాలా మందిలో అప్పన్న పాత్రపై ఒక సోలో సినిమా వచ్చినా బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. అలాగే సినిమాలో కూడా అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇంకా ఉన్నా బాగున్ను అన్ని కూడా చాలా మంది అనుకున్నారు. సో ఇలా అప్పన్న పాత్ర వరకు ఒక సోలో సినిమా వచ్చినా కూడా ఫ్యాన్స్ ఆడియెన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ గానే ఉన్నారని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు