గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ – అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం “గేమ్ ఛేంజర్”. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. అటు హిందీ నాట కూడా గేమ్ ఛేంజర్ స్థాయికి తగ్గ కలెక్షన్స్ సాధించలేకపోయింది. సినిమా టాక్ పరంగా సానుకూల స్పందన ఉన్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ రోజురోజుకు పెరగడం లేదు.
నిజానికి హిందీ నాట మొత్తం 3 రోజుల కలెక్షన్స్ పరంగా గౌరవనీయంగా ఉన్నప్పటికీ, సినిమా బడ్జెట్ ను బట్టి, సినిమాలో ప్యాడింగ్ ను బట్టి ఈ కలెక్షన్స్ సరిపోవు. ఇంతకీ, నార్త్ లో గేమ్ ఛేంజర్ కి వచ్చిన కలెక్షన్స్ వివరాలు చూస్తే.. శుక్రవారం నాడు రూ.8.64 కోట్లు, శనివారం నాడు రూ. 8.43 కోట్లు, ఆదివారం నాడు రూ.9.52 కోట్లు వచ్చాయి. మొత్తం మూడు రోజులకు గానూ ‘గేమ్ ఛేంజర్’కి వచ్చిన కలెక్షన్స్ రూ.26.59 కోట్లు. కాగా ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటించాడు. థమన్ సంగీతం అందించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు.