“దేవర” రిలీజ్ డేట్ కి “గేమ్ చేంజర్”?

“దేవర” రిలీజ్ డేట్ కి “గేమ్ చేంజర్”?

Published on May 13, 2024 5:00 PM IST

గత కొద్ది సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ పై వినిపిస్తున్న బజ్ ఏమిటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రం రిలీజ్ డేట్ కి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ను ముందుగా అక్టోబర్ 10 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఓజి చిత్రం రిలీజ్ డేట్ (సెప్టెంబర్ 27) పై దేవర చిత్రం రానుందని వార్తలు వస్తున్నాయి. అయితే దేవర ప్రీ పోన్ ప్లాన్, గేమ్ చేంజర్ కి కలిసి వచ్చేలా ఉంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు