“గేమ్ ఛేంజర్” షూటింగ్ కి ఇంకా ఇన్ని రోజుల సమయం?

“గేమ్ ఛేంజర్” షూటింగ్ కి ఇంకా ఇన్ని రోజుల సమయం?

Published on May 11, 2024 11:36 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మరో చిత్రం ఇండియన్ 2 మొదట విడుదల అవుతుంది. ఆ తర్వాతే గేమ్ ఛేంజర్ విడుదల కానుంది.

అయితే రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ ఛేంజర్ చాలా షూటింగ్‌ని పూర్తి చేయాల్సి ఉంది. సరిగ్గా 45 రోజుల షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని మాకు ఇప్పుడు తెలిసింది. 45 రోజులు అంటే చాలా సమయం అని చెప్పాలి. శంకర్ తిరిగి వచ్చి షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా లాక్ చేయలేదు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు