ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’

ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’

Published on Feb 7, 2025 1:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రీసెంట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఎలాంటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో మరో రెండు సినిమాలకు పోటీగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.

అయితే, రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి నెగెటివ్ ఫ్యీడ్‌బ్యాక్ రావడంతో ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ ప్రభావం చిత్ర కలెక్షన్స్‌పై కూడా పడింది. అటు సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈ మూవీకి ప్రేక్షకాదరణ తగ్గింది. ఫలితంగా ఈ మూవీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయ్యింది.

కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి(ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా అంజలి, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు