“గేమ్ ఛేంజర్”కి కథ ఇచ్చిన దర్శకుడు రివ్యూ.. ఏమంటున్నాడంటే

“గేమ్ ఛేంజర్”కి కథ ఇచ్చిన దర్శకుడు రివ్యూ.. ఏమంటున్నాడంటే

Published on Jan 11, 2025 2:06 PM IST

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రమే ఇది. అయితే శంకర్ మొదటిసారిగా తన కథ కాకుండా మరో దర్శకుని కథ లైన్ తో చేయడం జరిగింది. మరి వచ్చినా ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకుంది.

అయితే ఈ చిత్రానికి తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి శంకర్ తన మార్క్ సాలిడ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. మరి ఈ సినిమాపై కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన రివ్యూ ఇపుడు వైరల్ గా మారింది. గేమ్ ఛేంజర్ సినిమా వింటేజ్ శంకర్ గారి పొలిటికల్ పంచెస్ తో గ్రాండ్ గా మాస్ యాక్షన్ వైబ్స్ తో సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది.

రామ్ చరణ్, ఎస్ జే సూర్యల పెర్ఫామెన్స్ లు అదిరిపోయాయి. తిరు సినిమాటోగ్రఫీ అలాగే ఇతర టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపాడు. అలాగే ఈ సినిమాలో తనకి కూడా చిన్న భాగం ఇచ్చినందుకు శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కార్తీక్ సుబ్బరాజ్ షేర్ చేసాడు. దీనికి శంకర్ కూడా బదులుగా తనకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు