కీలక సీన్స్ కోసం “గేమ్ చేంజర్” ప్రయాణం

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకుంటుండగా శంకర్ షూట్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా కొన్ని కీలక సీన్స్ కోసం చరణ్ చెన్నై ప్రయాణం అయినట్టుగా తెలుస్తుంది.

ఓ రెండు రోజుల షూట్ కోసం చరణ్ ఇప్పుడు ప్రత్యేకంగా బయలుదేరాడట. మరి కేవలం రెండు రోజుల కోసమే అంటే అవి ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలా అంజలి, ఎస్ జే సూర్య అలాగే శ్రీకాంత్, రవిబాబు, సునీల్ తదితరులు నటిస్తుండగా ఈ సాలిడ్ పొలిటికల్ థ్రిల్లర్ కి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించాడు. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా దిగ్గజ నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version