భారీగా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన సందీప్ మాధవ్ “గంధర్వ”

Published on Jul 5, 2022 1:06 pm IST

సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం గంధర్వ. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో 500కి పైగా థియేటర్లను దక్కించుకోవడమే కాక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది గంధర్వ. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బెంగళూరు సహా ఓవర్సీస్ లో 500కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ సినిమాను పలు చోట్ల ప్రివ్యూలు వేసి చూపించగా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని, తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందు ఫీలవ్వని ఒక కొత్త పాయింట్ తో ఎమోషనల్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్, సురేష్ కొండేటి చెప్పిన విశేషాలు టాలీవుడ్‌లో చిత్రంపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. కొత్త పాయింట్‌తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించగా జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం :