‘గాండీవధారి అర్జున’ ఒటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published on Sep 21, 2023 1:00 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యువ భామ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ మూవీ గాండీవధారి అర్జున. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.

ఇక ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా సెప్టెంబర్ 24న ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మరి ఇతర భాషల డబ్బింగ్ వర్షన్ పై క్లారిటీ రావాల్సి ఉంది. విద్య రామన్, నాజర్, వినయ్ రాయ్, అభినవ్ గోమఠం, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి ముకేశ్ జి, అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫి అందించారు. మరి థియేటర్స్ లో విఫలమైన గాండీవధారి అర్జున మూవీ ఎంతవరకు ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :